గూగుల్‌ ప్లే స్టోర్‌ గేమ్స్‌పై మాల్‌వేర్‌ అటాక్‌ | Sakshi
Sakshi News home page

గూగుల్‌ ప్లే స్టోర్‌ గేమ్స్‌పై మాల్‌వేర్‌ అటాక్‌

Published Sat, Jan 13 2018 7:34 PM

Google Play Store removes 60 games infected with pornographic malware  - Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో : గూగుల్‌ ప్లే స్టోర్‌లోని గేమ్స్‌పై పోర్నోగ్రాఫిక్‌ మాల్‌వేర్‌ అటాక్‌ చేసింది. ఈ అటాక్‌ బారితో దాదాపు 60 గేమ్స్‌ను గూగుల్‌ తమ ప్లే స్టోర్‌ నుంచి తొలగించేసింది. తొలగించిన గేమ్స్‌లో ఎక్కువగా చిన్నపిల్లలు ఆడుకునేవే ఉన్నాయి. పోర్నోగ్రాఫిక్‌ మాల్‌వేర్ గూగుల్‌ ప్లే స్టోర్‌పై అటాక్‌ చేసినట్టు ఇజ్రాయిల్‌కు చెందిన సెక్యురిటీ రీసెర్చ్‌ సంస్థ చెక్‌పాయింట్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌ గుర్తించింది. ఫేక్‌ సెక్యురిటీ సాఫ్ట్‌వేర్‌ను యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకోవడం కోసం అడ్వర్‌టైజ్‌మెంట్లు డిజైన్‌ చేసినట్టు రీసెర్చర్లు రిపోర్టు చేశారు. గేమ్స్‌ యాప్‌లో పోర్నో యాడ్స్‌ ద్వారా ఈ మాల్‌వేర్‌ అటాక్‌ చేస్తుందని, ఒకవేళ వీటిని క్లిక్‌ చేస్తే, దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని రీసెర్చర్లు పేర్కొన్నారు. 

ఈ మాల్‌వేర్‌పై అలర్ట్‌ అయిన గూగుల్‌, వెంటనే తన ప్లే స్టోర్‌ నుంచి ఆ యాప్స్‌ను తొలగించింది. ప్లే స్టోర్‌ నుంచి తాము ఈ యాప్స్‌ను తొలగించామని, డెవలపర్ల అకౌంట్‌ను డిసేబుల్‌ చేశామని గూగుల్‌ తెలిపింది. వీటిని ఇన్‌స్టాల్‌ చేసుకునే వారికి తాము గట్టి హెచ్చరిక జారీచేస్తున్నామని పేర్కొంది.  యూజర్లను సురక్షితంగా ఉంచేందుకు చెక్‌ పాయింట్స్‌ చేసిన ఈ పనిని తాము అభినందిస్తున్నామని తెలిపింది. అయితే ఈ మాల్‌వేర్‌ ప్రభావానికి యూజర్ల డివైజ్‌లు ప్రభావితం కాలేదని చెప్పింది. మాల్‌వేర్‌ ప్రభావానికి గురైన యాప్స్‌ను  మూడు నుంచి ఏడు మిలియన్‌ సార్లు డౌన్‌లోడ్‌ అయ్యాయి. వాటిలో ఫైవ్‌ నైట్స్‌ సర్వైవల్ క్రాఫ్ట్, మెక్వీన్‌ కారు రేసింగ్‌ గేమ్‌ ఉన్నాయి. 

Advertisement
Advertisement